Vijayashanti : కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తున్నారు..!
Vijayashanti : రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలయ్యే వరకు పోరాటం ఆగదన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి.;
Vijayashanti : రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలయ్యే వరకు పోరాటం ఆగదన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. హుజురాబాద్ ఎన్నిక తర్వాత దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్.... ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పుల మోత కార్యక్రమంలో పాల్గొన్నారు విజయశాంతి. దళితుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. మాయమాటలతో ఓట్లేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తీరును ఎండగట్టేందుకే డప్పుల మోత కార్యక్రమం చేపట్టామన్నారు విజయశాంతి.