TS : ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం

Update: 2024-05-11 09:40 GMT

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు అవమానం జరిగింది. బీజీపీ పీ కీలక నేతలు సభా వేదికపైకి వెళ్లాల్సి ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాత్రం వెళ్లనివ్వలేదు.

రాజాసింగ్ వేదికపైకి వెళ్తుండగా.. ప్రధాని మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎస్పీజీ బందం రాజాసింగ్ కు అనుమతి నిరాకరించింది. తాను బీజేపీ ఎమ్మెల్యేను అని చెప్పుకున్నా ఎన్పీజీ సిబ్బంది ఎమ్మెల్యేను సభపైకి అనుమతించలేదు. దీంతో.. రాజాసింగ్ వెళ్లి జనంలో కూర్చున్నారు.

ఎల్బీ స్టేడియంలో సభావేదికపైకి నిర్దేశిత గెస్టులను మాత్రమే అనుమతించామని పోలీసులు చెబుతున్నారు. చెప్పిన టైం కన్నా లేట్ గా రావడం వల్లే రాజాసింగ్ ను అనుమతించలేదన్నారు. రాజాసింగ్ అనుచరులు మాత్రం ఈ వ్యవహారం పట్ల సీరియస్ గా ఉన్నారు. రాజాసింగ్ ను సభ కు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News