DK Aruna : కేసీఆర్ సొంత రాజకీయాల కోసం పనిచేస్తారు : డీకే అరుణ
DK Aruna : కేసీఆర్ సొంత రాజకీయాల కోసం పనిచేస్తారంటూ విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.;
DK Aruna : కేసీఆర్ సొంత రాజకీయాల కోసం పనిచేస్తారంటూ విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారామె. వాల్మీకిలను ఎస్సీలతో కలుపుతామని హామీ ఇచ్చారని.. కానీ దీనికి సంబంధించిన తీర్మానం కేంద్రానికి పంపలేదన్నారు. మైనారీటీలతో కలిపి తీర్మానం పంపి నాటకాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అవగాహన లేని సన్నాసులు తనను విమర్శిస్తున్నారని.... సోషల్ మీడియాలో అబద్దాలను ఎవ్వరూ నమ్మరన్నారు డీకే అరుణ.