రహస్య ప్రదేశాల్లో వారితో బీజేపీ మంతనాలు
గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన రెబల్స్‌తో బుజ్జగింపులకు తెరలేపింది బీజేపీ. వారితో రహస్య ప్రదేశాల్లో మంతనాలు చేస్తోంది. పార్టీ అభివృద్ధి కోసం సహకరించాలని..;
గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన రెబల్స్‌తో బుజ్జగింపులకు తెరలేపింది బీజేపీ. వారితో రహస్య ప్రదేశాల్లో మంతనాలు చేస్తోంది. పార్టీ అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొడితే .. తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతందంటూ తిరుగుబాటు నేతలకు చెబుతున్నారు బీజేపీ అగ్రనేతలు. కష్టపడే వారిని పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. కేవలం రెబల్స్‌ను బుజ్జగించడమే కాదు... ఆపరేషన్ ఆకర్షన్‌ను సైతం వేగవంతం చేసింది బీజేపీ. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా చర్చలు జరుపుతున్నారు.
కాంగ్రెస్‌లో ముఖ్యనేతల్ని కన్వియన్స్ చేసే పనిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానం చెప్పే వారి కోసం వేట సాగిస్తున్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీలను టార్గెట్ చేసింది బీజేపీ. రంగంలో దిగిన భూపేందర్ యాదవ్....స్వయంగా వెళ్లి నేతల్ని కలుస్తున్నారు. మరోవైపు ప్రచారం కోసం బీజేపీ శ్రేణులు రంగంలో దిగాయి. డివిజన్‌ల వారిగీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు బీజేపీ ఇంఛార్జ్‌లు, సమన్వయకర్తలు.