తెలంగాణ మినీ నయాగరా జలపాతంగా పిలవబడే ములుగు జిల్లా వాజేడు మండలం చిక్కుపల్లి బోగత జలపాతానికి జలకళ సం తరించుకుంది. వాజేడు మండలం బోగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం దట్టమైన పచ్చని అడ వుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది. వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్లు దూరంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకు 20 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతం ఉంది. జూలై నుంచి నవంబరు వరకు భారీగా నీరు చేరుతుంది. బోగత వాటర్ ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. ఒక నెల ముందే జలపాతానికి నీరు చేరి జలకళ సంతరించుకోవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగు లోకి వర్షపు నీరు చేరింది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో బొగత జలపాతంలో నీరు చేరేది. 50 అడుగుల ఎత్తు నుండి జలధారలు జాలు వారుతుంటే తుంపర్లు ఎగిసిపడుతున్నాయి. బోగత వాగులోకి నీరు చేరడంతో చుట్టుపక్కల ప్రజలు జలపాతం వద్ద కు చేరుకుని జలపాతాన్ని ఆసక్తికరంగా తిలకిస్తున్నారు.