మహబూబ్ నగర్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలని కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్ననేపథ్యంలో కౌంటింగ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక రిజల్ట్..పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. జూన్ 2న కౌంటింగ్ కు అవకాశం కల్పించింది ఈసీ.
పార్లమెంట్ ఎన్నికలు పూర్తైన తర్వాత కౌంటింగ్ చేసుకోవాలని సూచించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు.