తెలంగాణ కేబినెట్ వాయిదా పడింది. ఈరోజు (జులై 25, 2025) జరగాల్సిన సమావేశం జులై 28, 2025కి వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు సమాచారం. ఏఐసీసీ ఓబీసీ మీటింగ్లో ముగ్గురు మంత్రులు పాల్గొంటున్నారు. OBC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, వాకిటి శ్రీహరి వెళ్లారు. ఇప్పటికే దిల్లీలోనే ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దీంతో ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో క్యాబినెట్ వాయిదా పడింది.