BRS: కార్మిక యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం

Update: 2025-10-26 03:00 GMT

హై­ద­రా­బా­ద్- బా­లా­న­గ­ర్‌­లో­ని MTAR టె­క్నా­ల­జీ­స్ లి­మి­టె­డ్ కం­పె­నీ కా­ర్మి­కుల గు­ర్తిం­పు యూ­ని­య­న్ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్‌ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ తర­ఫున పోటీ చే­సిన మాజీ మం­త్రి వి. శ్రీ­ని­వా­స్ గౌడ్ , బీ­జే­పీ ఎంపీ రఘు­నం­ద­న్ రా­వు­ని ఓడిం­చి, భారత ట్రే­డ్ యూ­ని­య­న్ అధ్య­క్షు­లు­గా ఎన్ని­క­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా శ్రీ­ని­వా­స్ గౌడ్ మా­ట్లా­డు­తూ.. MTAR కం­పె­నీ యా­జ­మా­న్యం­తో మా­ట్లా­డి 359 మంది కా­ర్మి­కు­ల­ను పర్మ­నెం­ట్ చేసి, కా­ర్మి­కు­ల­కు క్యాం­టీ­న్‌­ను ఏర్పా­టు చే­య­డం జరి­గిం­ద­న్నా­రు. అదే­వి­ధం­గా కా­ర్మి­కు­ల­కు బే­సి­క్‌­ను 30% నుం­చి 50% కు పెం­చ­డం జరి­గిం­ద­ని, అదే­వి­ధం­గా ఇప్పు­డు తనపై నమ్మ­కం పె­ట్టు­కొ­ని గె­లి­పిం­చిన కా­ర్మి­కు­లం­ద­రి­కీ కృ­త­జ్ఞ­త­లు తె­లి­పా­రు. కం­పె­నీ­లో కా­ర్మి­కు­ల­కు ఉన్న ఎలాం­టి సమ­స్య­నై­నా పరి­ష్క­రి­స్తా­న­ని హామీ ఇచ్చా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో MTAR కం­పె­నీ BRTU యూ­ని­య­న్ జన­ర­ల్ సె­క్ర­ట­రీ మాయ రా­జ­య్య, చీఫ్ వైస్ ప్రె­సి­డెం­ట్ సత్య­ప్ర­సా­ద్, వైస్ ప్రె­సి­డెం­ట్ లు వెం­క­టే­శ్వర రె­డ్డి, సమ్మ­య్య, రా­యు­డు యా­ద­వ్ తది­త­రు­లు ఉన్నా­రు.

Tags:    

Similar News