తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బిఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిరసన దీక్షలో పాల్గొన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. గతంలో తమ ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10 వేలు ఇచ్చిందన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 15 వేలు ఇస్తామని రైతులను మభ్యపెట్టి అధికారం లోకి వచ్చి.. తరువాత ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చింది లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం రైతు బంధు నిధులను రైతుల అకౌంట్స్ లో జమచేయాలని డిమాండ్ చేశారు.