TG: పౌరసరఫరా శాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం
ఆరోపించిన కేటీఆర్... ఖండించిన కాంగ్రెస్;
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు తెరలేపిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో 750కోట్లు, పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో 300కోట్లు కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై.. 1100 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని.... కేటీఆర్ చెప్పారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న కుంభకోణంపై... ఆధారాలతో సహా భారాస న్యాయపోరాటం చేస్తుందన్న కేటీఆర్... ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తామని తెలిపారు.
నిరాధారం
పౌరసరఫరాల శాఖలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని.. అయినా ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో..... రైతులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. తాలు, తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని..... హెచ్చరించారు. మిల్లర్లపై నిబంధనల ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం తమదన్నారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని.... ఆయన మండిపడ్డారు. సన్నబియ్యాన్ని ఎక్కువ ధర పెట్టి కొంటున్నారన్న ఆరోపణలను..మంత్రి కొట్టిపారేశారు. 42రూపాయలకు కిలో సన్నబియ్యం ఇస్తే.. ఎంతైనా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్న మంత్రి.... అందులో 2వేల కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
విద్యుత్, పరిశ్రమల రంగాలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జనరేటర్ సమస్య వల్లే విద్యుత్ నిలిచిపోయిందని తెలిపారు. భారాస హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో.... 121 సార్లు విద్యుత్ అంతరాయం కలిగిందని చెప్పారు. తమ ప్రభుత్వంలో...... విద్యుత్ రంగంలో కొత్తగా ఏమీ చేయలేదని, భారాస హయాంలో ఉన్న విద్యుత్ వ్యవస్థనే...... కొనసాగిస్తున్నామన్నారు. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.... అర్హులైన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు... ఎక్కడికి పోవట్లేదని, కొత్తవి వస్తున్నాయని తెలిపారు. కేయిన్స్ పరిశ్రమ ఎక్కడికీ పోలేదని......., కేంద్రం ఇచ్చే రాయితీల కోసం ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు వివరించారు.