TG : పేదల ఇళ్లకు మద్దతుగా రంగంలోకి బీఆర్ఎస్

Update: 2024-09-30 06:00 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ సర్కారు పెద్దల ఇళ్లు విడిచిపెట్టి పేదల ఇళ్లు కూల్చుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ గుర్తు హస్తం గుర్తుకాదు భస్మాసుర హస్తమని విమర్శించారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్లు చెరువు కుంటలో ఉంది. ముందు FTLలో ఉన్న రేవంత్‌ సోదరుని ఇళ్లు కూల్చాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ నీ తమ్మునికో న్యాయం.. పేదలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించిన హరీష్‌రావు..పేదలకు తాము అండగా ఉంటామన్నారు. 

Tags:    

Similar News