హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక పురాతన భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ భవనం శిథిలావస్థకు చేరుకున్నందున దానిని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే భవనం యజమానికి నోటీసులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యజమాని పట్టించుకోలేదు. బేగంబజారులో ఇప్పటికీ చాలా మంది వ్యాపారులు ఇలాంటి పురాతన భవనాల్లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను తొలగించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.