Ayyyappa Temple : అయ్యప్ప గుడిలో దొంగతనం .. అర్ధరాత్రి చాకచక్యంగా

Update: 2024-05-29 12:01 GMT

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు హండి పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. దొంగతనం చేసిన తీరు దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. అర్ధరాత్రి సమయంలో చాకచక్యంగా హుండీ తాళం పగలగొట్టి అందులో ఉన్న డబ్బు అంతా ఎత్తుకుపోయిన సన్నివేశం అంత రికార్డు కావడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను వెతికే పనిలో పడ్డారు. తాళం పగలగొట్టిన దొంగ ఎవరికి అనుమానం రాకుండా డబ్బంతా తీసుకెళ్లి హుండీ తాళాన్ని మళ్ళీ అనుమానం రాకుండా హండికే తగిలించి వెళ్ళాడు. మధ్యాహ్నం అనుమానం వచ్చిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News