Sajjanar : పోకిరీ కండక్టర్ అరెస్ట్.. తగ్గేదిలేదన్న సజ్జనార్

Update: 2024-07-18 06:44 GMT

ఆర్టీసీ బస్సులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ కటకటాల పాలయ్యాడు. బస్సు రద్దీగా ఉన్న సమయంలో ఇదే అదనుగా భావించిన బస్సు కండక్టర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో తనకు జరిగిన అనుభవాన్ని సదరు యువతి ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డికి, టీజీఎస్ ఆర్టీసీఎండీ సజ్జనార్ కు, కేటీఆర్ పాటు షీటీమ్స్ కు ట్యాగ్ చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టిన యువతి పట్ల అనుచితంగా వ్యవహరించిన కండక్టర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

ఈనెల 15న 21 ఏళ్ల యువతి మణికొండ నుంచి హిమాయత్ నగరకు వెళ్లేందుకు బయలుదేరింది. ఈక్రమంలో మోహదీ పట్నంలో ఉదయం 8 గంటల సమయంలో 64ఎం/ 123 నంబరు బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణీకుల రద్దీగా ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా భావించిన కండక్టర్ టికెట్ ఇస్తూ ఆ యువతి చాతిని తాకాడు. అయితే బస్సులో రద్దీ కారణంగా కండక్టర్ చేతి తన చాతికి పొరబాటున తాకిందని ఆ యువతి భావించింది. చాతీ తాకినా ఆ యువతి తనను ఏమీ అనకపోవడంతో కండక్టర్ మరింత రెచ్చి పోయాడు. తిరిగి ఆ యువతి దగ్గరకు వచ్చి ప్రైవేట్ భాగాలను తాకడం ప్రారంభించాడు. ఆ యువతి బిగ్గరగా అరవడంతో కండక్టర్ అక్కడి నుంచి జారుకున్నాడు. బస్సులో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బాదిత యువతి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడంతో కండక్టర్ నీచబుద్ధి వెలుగులోకి వచ్చింది.

హిమాయత్ నగరకు వెళ్తున్న బస్సులో కండక్టర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని 21 ఏళ్ల యువతి ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ట్వీట్ తోపాటు ఆమె తీసిన ఓ వీడియోను, టికెట్ ను కూడా సీఎం, ఆర్టీసీ ఎండీలకు షేర్ చేసింది. బస్సులో తనకు జరిగిన చేదు అనుభవంపై యువతి చేసిన ఫిర్యాదుపై ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందించారు. ఫరూక్ నగర్ డిపోకు చెందిన కండక్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కండక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఫారూఖ్ నగర్ డిపోకు చెందిన కండక్టర్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు.

Tags:    

Similar News