కామారెడ్డి జిల్లా గాంధారిలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టిం ది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రవికుమార్ మృతి చెందగా మరో కానిస్టేబుల్ సుభాష్ కు గాయాలయ్యాయి. నిన్న అర్థరాత్రి రోడ్డు పక్కన పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లపైకి కారు ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు కానిస్టేబుళ్లు ప్రయత్నించినా ప్రమాదం జరిగింది. రవికుమార్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. కారు అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో పాటు డ్రైవర్ మద్యం మత్తుల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమాద దృశ్యాలు రికార్ట్ అయ్యాయి.