పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు వ్యక్తు లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకరు సజీవ దహనం కాగా.. మరొకరిని స్థానికులు మంటల నుంచి కాపాడి హాస్పిటల్ తరలించా రు. శంషాబాద్ వైపు నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గండి చెరువు సమీపంలోని ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ అవతలి వైపు ఓ వాహనం ప్రమాదాన్ని గురై డివైడర్ను ఢీకొ ట్టింది. వారికి సహాయం చేసేందుకు బొలెరో వాహనాన్ని పక్కనే ఆపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదు పులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనాస్థ లికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని హైదరాబాద్లోని బహదూర్పుర హెచ్బీ కాలనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.