మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి రహదారిపై మాజీ మంత్రి మల్లారెడ్డి సిక్కర్ తో ఉన్న కారు అతివేగంతో బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ప్రగతినగర్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో గురువారం ఫుట్ పాత్ పై ఉన్న దుకాణాలను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. కారు వేగంగా వెళుతూ పుట్ పాత్ పై ఉన్న చెరుకు రసం స్టాల్ ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో షుగర్ కేన్ స్టాల్ పూర్తిగా ధ్వంసం కాగా ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలో చెరుకు రసం బండి చిరు వ్యాపారీ పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.