బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదైంది. తన భూమిని వారు కబ్జా చేశారంటూ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఆ భూమికి వారు పంజాబ్ గ్యాంగ్‌ను కాపలా ఉంచారని, ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై దాడి చేయించారని పేర్కొంటూ దామోదర్ పోలీసుల్ని ఆశ్రయించారు.
ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు.
2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ (ఆరు సెక్షన్ల కింద) పోలీసులు కేసు నమోదు చేశారు.