KCR : అస్సాంలో సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు..!
KCR : సర్జికల్ స్ట్రయిక్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అస్సాం బీజేపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.;
KCR : సర్జికల్ స్ట్రయిక్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై అస్సాం బీజేపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సర్జికల్ స్ట్రయిక్స్‌కు ప్రూఫ్ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అస్సాంలో బీజేపీ నేతలు కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పట్ల అస్సాం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. అస్సా సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆయనపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని రాహుల్ అడగడంలో తప్పు లేదన్న కేసీఆర్...తాను కూడా ఆధారాలు అడుగుతున్నానన్నారు.