Telangana : సీఎం కేసీఆర్‌పై వాట్సప్ గ్రూపులో విమర్శలు చేసిన వ్యక్తి పై కేసు నమోదు..!
Telangana : సీఎం కేసీఆర్‌పై గ్రామ వాట్సప్ గ్రూపులో విమర్శలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.;
KCR (tv5news.in)
Telangana : సీఎం కేసీఆర్‌పై గ్రామ వాట్సప్ గ్రూపులో విమర్శలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ అభివృద్ధి నిధుల విషయంలో కేసీఆర్‌పై విమర్శలు చేసిన కొండ నరేష్ అనే వ్యక్తిపై కేసు ఫైల్ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ముత్యంపేటలో జరిగింది. కొండ నరేష్ అనే యువకుడి ఊరి వాట్సప్ గ్రూపులో పంచాయతీకి రావాల్సిన నిధులపై కేసీఆర్‌ను విమర్శించారు. దీనిపై స్థానికి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొండ నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై కేసు నమోదు చేయడంపై గ్రామంలో వినూత్న నిరసన తెలిపాడు కొండ నరేష్. ప్రభుత్వంపై విమర్శలు చేసి తనల కేసుల పాలుకావొద్దంటూ దండోరా వేశాడు.