పుష్ప -2 తో ప్యాన్ వరల్డ్ గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను ఇప్పట్లో వివాదాలు వదిలేలా లేవు. అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టుల పై 4 కేస్ లు నమోదయ్యాయి. ప్రభుత్వం, సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్ట్ లు పెట్టిన వారి మీద కేస్ లు నమోదు చేశారు పోలీసులు. పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేస్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులు బుక్ చేశారు. నిందితులపై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో మరింత బాధ్యతగా వ్యవహించాలని పోలీసులు, నిపుణులు నెటిజన్లకు సూచిస్తున్నారు.