TG : కుల గణన సర్వేతో బుడగులకు న్యాయం : ఎమ్మెల్యే మందుల సామేల్

Update: 2024-11-09 17:45 GMT

నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేలుమాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనగారిన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేయాలని సమర్థవంతంగా సర్వేను నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ యాదగిరి, ఆర్ఐ అజారుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News