రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషన్ గా చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణరావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రైతు కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి. సీఎస్ రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేసిన ఆయనను తాజాగా ప్రభుత్వం సీఐసీగా నియమించింది. చంద్ర శేఖర్ రెడ్డి ఈ పదవిలో మూడు సంవత్స రాలపాటు లేదా 65 ఏండ్ల వరకు ఉంటారు.