Assembly : అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గందరగోళం

Update: 2024-08-01 08:41 GMT

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా శాసన సభతోపాటు మీడియా పాయింట్ లోనూ గందరగోళం ఏర్పడింది. శాసన సభలో ప్రతిపక్షాన్ని కార్నర్ చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదాన్ని పొందిన పొందిన మీడియాపాయింట్లోనూ అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, విపక్షాలు బీజేపీ వాయిస్ శాసనసభ మీడియా పాయింట్లో వినిపించకుండా ఎత్తువేసి సఫలీకృతమైంది. బుధవారం సాయంత్రం శాసనసభ ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి గురువారానికి వాయిదా పడగానే అధికార కాంగ్రెస్ సభ్యులు పెద్ద సంఖ్యలో మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అక్కడకు చేరుకుని మాట్లాడేందుకు వేచి ఉన్నారు.

సీఎంకు వ్యతిరేకంగా మీడియా పాయింట్లోనూ కేటీఆర్ నేతృత్వంలో నినాదాలతో హోరెత్తించారు.

Tags:    

Similar News