TG : వెంటపడ్డ కుక్క.. మూడో అంతస్తునుంచి పడి యువకుడు మృతి

Update: 2024-10-22 09:45 GMT

హైదరాబాద్ లోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి కింద పడి యువకుడు మృతిచెందాడు. తెనాలి యువకుడు ఉదయ్‌ అశోక్ నగర్ లో ఉంటున్నాడు. సండే స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీప్రైడ్‌ హోటల్‌కు వెళ్లాడు. హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్‌ వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే టైంలోహోటల్‌ కిటికీ నుంచి ఉదయ్‌ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News