Malkajgiri MLA : మల్కాజిగిరి ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు

Update: 2025-04-15 10:15 GMT

మల్కాజిగిరి ఎమ్మెల్యేపై చీటింగ్ కేసుమాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అధినేత యేసుబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ కు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని యేసుబాబు ఫిర్యాదులో తెలిపారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్ కు 40 మంది సిబ్బందిని కేటాయించానని, మొత్తం రూ.50 లక్షలు ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపాడు. పలు దఫాలుగా మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.30 లక్షలు చెల్లించాడని, మిగిలిన రూ. 20 లక్షలు ఇవ్వాలని అడిగితే స్పందించలేదని యేసుబాబు ఫిర్యాదు చేశాడు. యేసుబాబు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టిన పోలీసులను రాజశేఖర్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజ శేఖర్రెడ్డిపై 316/2,318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీ సులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News