నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సయ్యద్రి అడవులలో చిరుత పులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు రోజుల నుంచి పశువులు మేకలపై చిరుత, పెద్ద పులి దాడి చేస్తున్నట్లు వార్త స్థానికంగా అలజడి రేపింది. దీంతో నిజానిజాలను తెలుసుకునేందుకు సోమవారం అటవీశాఖ అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న ఒక పగ్ మార్క్ ను చూసి అది ఏ జంతువు కు సంబంధించినది అనే విషయాన్ని తెలుసుకుని అది పెద్దపులి ఆనవాలుగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాలతో పలు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతపులి సంచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండా వాసులు అడవి లోపలికి పశువులను మేపడానికి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.