Chicken Price : తగ్గేదే.. లే.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు..!
Chicken Price : రోజురోజుకూ చికెన్ ధరలు పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.;
chicken rates
Chicken Price : రోజురోజుకూ చికెన్ ధరలు పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రావణమాసంలో అయిన రేటు తగ్గుతుందా అంటే రికార్డు స్థాయిలోనే ధరలు నడిచాయి.. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
కిలో చికెన్ మార్కెట్లో రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతుంది. రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. అటు మటన్ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయని అంటున్నారు షాపు యజమానులు.
మాసం ధరలు ఈ రేంజ్‌లో పెరగడంతో చాలామంది గుడ్డుతోనే సరిపెట్టుకుంటున్నారు.. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. మాంసం ధరలు ఇలా ఉంటే కూరగాయల రేట్లు కూడా తక్కువేమీ లేవు.. టమాటా, ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనితో ఏం తినేటట్లు.. ఏం కొనేటట్లు లేదని అనుకుంటున్నారు సామాన్యులు.