chicken price : భారీగాపెరిగిన చికెన్ ధరలు.. 20 రోజుల్లోనే రూ. 100
chicken price : నాన్‌వెజ్ ప్రియులకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి చికెన్ ధరలు.. సామాన్యుడు చికెన్ తినాలంటే ఓ సారి పర్సు చూసుకునే పరిస్థితి ఏర్పడింది.
chicken price : నాన్‌వెజ్ ప్రియులకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి చికెన్ ధరలు.. సామాన్యుడు చికెన్ తినాలంటే ఓ సారి పర్సు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. కేవలం 20 రోజుల్లోనే రూ.100 పెరిగింది. కిలో చికెన్ రూ.175 ఉండగా ఇప్పుడు మార్కెట్లో రూ. 280కి అమ్ముతున్నారు. అయితే ఈ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం అమ్ముతున్నారని ఓ అంచనా.. ఇక ఆదివారం అయితే అదనంగా మరో 15 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నయట. ఇక గత పది రోజుల్లో అయితే లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయట.
శీతాకాలం ముగిసి వేసవి రావడం, వాతావరణ మార్పులకి కోడిపిల్లలు మృత్యువాత పడుతుండడం, వాటికి ఆహరంగా వేసే సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలు కూడా పెరగడంతో మాసం ధరలు పెరిగాయి. మరితంగా ఎండలు ముదిరి కోళ్ల మరణాలు పెరిగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.