CM Revanth Reddy : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై సీఎం ఫైర్

Update: 2024-11-28 10:15 GMT

గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో తరుచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ని ర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించా రు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావా రణంలో పౌష్టికాహారం అందజేయాలని పేర్కొ న్నారు. మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని అన్నారు. విద్యార్థులకు పౌష్టికా హారం అందించేందుకు చార్జీలను పెంచామని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల కులగణన కూడా చేయండి అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఎవరు ప్రయత్నించి నా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. వరుస ఘటనలకు బాధ్యులైన వారిపై జిల్లా కలె క్టర్లు వేటు వేయాలని ఆదేశించారు. వదంతు లతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేం దుకూ వెనుకాడబోమని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్: కులగణన సర్వే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వివరాలు నమోదు చేయించుకున్నారు. సర్వే ఎన్యుమరే టర్, అధికారులు సీఎం రేవంత్ కుటుంబ వి వరాలను ఆరా తీశారు. హైదరాబాద్ కలెక్టర్ అసుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. సర్వే పురోగతిపై అధికారుల తో సీఎం మాట్లాడారు. సర్వేపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోందని అడిగారు. ప్ర భుత్వ అధికారులు కూడా కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకునేలా ఉత్తర్వు లు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్ర తినిధుల కోసం సర్వే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలన్నారు.

Tags:    

Similar News