షబ్బీర్ అలీ చెప్పేవి అన్నీ దొంగ ముచ్చట్లే : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో విపక్షాల తీరును సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి పదే పదే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. సీనియర్..;
రాష్ట్రంలో విపక్షాల తీరును సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి పదే పదే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పేవి అన్నీ దొంగ ముచ్చట్లు అంటూఫైర్ అయ్యారు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటాయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతదని కేసీఆర్ అన్నారు. ఇక సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు దొంగ మాటలు మాట్లాడటం అలవాటైపోయిందని.. ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.