CM KCR : వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం
CM KCR : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.;
CM KCR : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక్కొక్కరినీ పలకరించారు. ఆత్మీయ నేత పలకరింపుతో జనం ఆనందం వ్యక్తంచేశారు. పలువురికి కేసీఆర్ స్వయంగా వడ్డించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గ్రామానికి చేరుకున్న కేసీఆర్... ముందుగా గ్రామసభ వేదికపై అందరికీ అభివాదం తెలిపారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి భోజనశాలకు వెళ్లారు. భోజనం చేస్తున్న వాళ్లలో కొందరు ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యల్ని నోట్ చేసుకోవాలని అధికారుల్ని కేసీఆర్ ఆదేశించారు.