KCR : కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ..!
KCR : కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.;
KCR : కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీని పొడిగించాలని షెకావత్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అలాగే.. గోదావరిపై తెలంగాణ చేపట్టిన పలు ప్రాజెక్టుల నివేదికలు సమర్పించినందున.. వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని షెకావత్‌కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది జలాల పంపిణీపై బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను కొనసాగించాలని లేదా.. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్నారు కేసీఆర్. షెకావత్‌తో సమావేశంలో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.