కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ..!
ఢిల్లీ పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై చర్చించారు.;
ఢిల్లీ పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై చర్చించారు. అలాగే కృష్ణా గోదావరి నదుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా వివిధ ప్రాజెక్టులకు అనుమతులు సహా నీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.