CM KCR review : ఈ నెల 26న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం..!
CM KCR : పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం అమలు తీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.;
CM KCR : పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం అమలు తీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్... మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26న ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్‌లు, జిల్లా పంచాయతీ అధికారులు హాజరు కానున్నారు. పథకాలు అమలు జరుగుతున్న తీరు, చేపట్టాల్సిన చర్యల్ని కేసీఆర్ వివరించనున్నారు. వివిధ జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతిలో తీసుకున్న చర్యలు, హరితహారం పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై సీరియస్‌గా వ్యవహరిస్తామన్న కేసీఆర్ ప్రకటనతో సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.