ఇలాంటి బాధాకరమైన తీర్మానాన్ని ప్రవేశపెడతామని అనుకోలేదు : కేసీఆర్‌

ఎమ్మెల్యేగా ఎదిగి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

Update: 2021-03-16 07:06 GMT

నాగార్జున సాగర్‌ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేమని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాప తీర్మానాన్ని కేసీఆర్‌ ప్రవేశపెట్టారు.

ఇలాంటి బాధాకరమైన తీర్మానాన్ని ప్రవేశపెడతామని అనుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ నోముల కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మండల పరిషత్‌ అధ్యక్షునిగా ప్రారంభమైన నోముల ప్రస్థానం.. ఎమ్మెల్యేగా ఎదిగి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

నోముల నర్సింహయ్య గుండె పోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు తీరని దుఖఃన్ని మిగిల్చిందని.. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేమన్నారు సీఎం కేసీఆర్‌. 


Full View


Tags:    

Similar News