CM KCR : సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన...!
CM KCR : సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును సీఎం కేసీఆర్ ప్రారంభించారు.;
CM KCR : తెలంగాణలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలాయాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ .... ఆఫీసు మొత్తం కలియ తిరిగారు. ఆధునిక సదుపాయాలతో.. జీప్లస్ వన్‌గా ఎకరం విస్తీర్ణంలో నాలుగుకోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాం ఏర్పాటు చేసారు.
అనంతరం... కొండపాక మండలం రాంపల్లి శివారులోని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సముదాయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. కార్యాలయంలో పూజలు చేశారు. 19 కోట్ల రూపాయలతో పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణం జరిగింది.సీపీ ఆఫీస్‌తోపాటు ఇతర ఉన్నతాధికారుల కార్యాలయలూ ఇక్కడ ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు భవనాలను నిర్మించారు. నూతన కలెక్టరేట్ భవనాలతో కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయ భవనాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పర్యటనలో సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రజాప్రతినిధులు వున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానుంది. సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ భవనాలను పర్యావరణ పరిరక్షణ ఉండేలా హరిత భవనాలుగా నిర్మించారు. ఒక్కో భవనానికి 50 నుంచి 60 కోట్ల వరకు ఖర్చు చేశారు.