ఐదో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన.. జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసే ఛాన్స్...!
ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఐదో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేసీఆర్.. ఇవాళ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసే అవకాశముంది.;
ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఐదో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేసీఆర్.. ఇవాళ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసే అవకాశముంది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర గెజిట్‌పై అభ్యంతరాలను తెలియజేయనున్నారు. దీనిపై పలువురు నిపుణులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు మంత్రి వద్ద బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే పోలీసు శాఖలోనూ మార్పులు జరిగాయన్నారు. అయితే పోలీసు శాఖలో ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. పోలీసు శాఖలో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగిందని, ఇక ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగాయని సీఎం కేసీఆర్ ఓ లేఖలో కేంద్ర హోంశాఖ మంత్రికి తెలిపారు.