MLA Kaushik Reddy : సీఎం రేవంత్ దళిత ద్రోహి : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Update: 2024-12-03 07:30 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలి పోతారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని తెలిపారు.

అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా దళితబంధు లబ్దిదారులకు డబ్బు చేరలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళితబంధు సాయాన్ని 12 లక్షల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు కౌశిక్‌రెడ్డి. 

Tags:    

Similar News