తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైదరాబాద్ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. బీజేపీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో జూలై 8వ తేదీని తదుపరి విచారణ తేదీగా న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ప్రధాన అంశం – బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్‌పై పరువునష్టం దావా వేసిన విషయం. బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఓ సభలో చేసిన వ్యాఖ్యలు, తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చినట్లుగా, ప్రజల్లో అపోహలు కలిగించాయంటూ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తాజా తీర్పుతో రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.