Telangana : సుకుమార్ కూతురికి సీఎం రేవంత్ రెడ్డి సన్మానం

Update: 2025-08-20 06:45 GMT

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన కుమార్తె సుకృతి వేణితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సుకృతి నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సుకుమార్ కుటుంబంతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సుకుమార్, తబిత దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. వారిలో కుమార్తె సుకృతి, కుమారుడు సుక్రాంత్ ఉన్నారు. సుకృతి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం.

Tags:    

Similar News