తెలంగాణలో ఎమ్మెల్యేలు గాంధీ-కౌశిక్ రెడ్డి రాజకీయ రగడపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. గురవారం జరిగిన ఘటనల మీద డీజీపీ జితేందర్‌కు సీఎం ఫోన్ చేసి తెలుసుకున్నారు. శాంతిభద్రతలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
చేసిందంతా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నీతులు చెబుతున్నారని పైరయ్యారు రేవంత్. తమ ప్రభుత్వాన్ని మూడంచెల్లో కూల్చేస్తామన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయామనే హక్కసుతోనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.