ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే ఆలయంలో దివ్యవిమాన స్వర్ణగోపుర మహాకుంభ సంప్రో క్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వర్ణ గోపుర మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో సీఎం పాల్గొననున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వర్ణ గోపురాన్ని శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామికి అంకితం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇవాళ భద్రతా ఏర్పాట్లను భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆలయంలో యాగశాల, ఉత్తర ద్వారం, ప్రధానాలయం సహా పలు ఆలయ పరిసరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిం చి భద్రతకు సంబంధించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఘనంగా పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగం యాదగిరిగుట్టలో దివ్యవిమాన స్వర్ణగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు యాగశాలలో పంచకుండాత్మక సుద ర్శన నారసింహ యాగాన్ని అర్చకులు పరమానందం గా నిర్వహించారు. మొదట స్వామివారిని ప్రధానాలయం నుండి తిరువీధి సేవ ద్వారా యాగశాల ప్రదేశానికి తీసుకువచ్చి యాగశాల గావించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన మంత్రపుష్పం, చేసి తీర్థప్రసాదగోష్టి జరిపారు.