షాద్‌నగర్‌లో ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనితో సంబంధం ఉన్నవారిని పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలన్నారు. బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
షాద్‌నగర్ పీఎస్‌లో ఓ ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి. బంగారం దొంగలించారన్న ఆరోపణలతో బాధిత మహిళను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు. 10 రోజులు గడిచినా రిమాండ్ చేయలేదు. తర్వాత ఇంటికి పంపారు. దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సీఐ రాంరెడ్డిని బదిలీ చేశారు.