తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి

Update: 2020-12-23 11:40 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంచు కారణంగా రోడ్లు కనబడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి. దాంతో చలికి ఏజెన్సీ మండలాల ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. గ్రామాల్లో ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి నుంచి ఉపశమనం పొందుతున్నారు. విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరులో 9, మినుములూరులో 7, లంబసింగిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పతాక స్థానికి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన అర్లి(టి)లో 3.6, గిన్నెధరలో 3.9, కోహీర్‌లో 3.4 అత్యలప్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో చలి పంజా విసురుతోంది. రాత్రితోపాటు పగలు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. పగలు కూడా చలి వణికిస్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ ఉష్ణగ్రతలు 10.4గా నమోదయ్యింది. 

Tags:    

Similar News