మహబూబాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేపాయి. అర్థరాత్రి అడవిలో కొందరు పూజలు చేయడం సంచలనం కలిగించింది. అమావాస్య రోజులు కావడంతో పూజలు చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపించారు. సుమారు పదిమంది... పసుపు కుంకుమలతో... హిజ్రాలతో పూజలకు సిద్దమవుతుండగా స్థానికుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భయంతో తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి... పూజలు జరిగే చోటికి గ్రామస్థులు చేరుకున్నారు. పండుగ పూట... పుట్ట మన్ను కోసం వచ్చామని... ఇది తమ ఆచారమని... ఇక్కడ ఎలాంటి పూజలు చేయడం లేదని హిజ్రాలు తెలిపారు. అయినప్పటికీ బ్రాహ్మణపల్లి గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.