హామీల అమలు, పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ స్థానిక ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లాలని BRS భావిస్తోంది. కాంగ్రెస్ బాకీకార్డును ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా అధికార పక్షాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుందన్న....... ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా.... తాము బలంగానే ఉన్నట్లు చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కలిసి వస్తాయన్న విశ్వాసంతో ఉంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న BRS.... తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనతో కాంగ్రెస్ పాలన పోల్చుకుంటున్నారని ప్రజలకి వాస్తవాలు అర్థమవుతున్నాయని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీకలుపుకొనిపోయి మరోసారి సత్తా చాటాలన్న కేటీఆర్ .. ప్రజలు మళ్లీ KCR, BRS వైపు చూస్తున్నారని... త్వరలో జరిగే ఎన్నికల్లో అది ప్రస్ఫుటమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు..