TG : ఫిరాయింపులు ప్రారంభించింది కాంగ్రెస్సే: కేటీఆర్

Update: 2024-07-09 09:07 GMT

 పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. 2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించిందన్నారు. తద్వారా ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకుందని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటినీ విస్మరించారన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణ మాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

Tags:    

Similar News