రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 3. 35 కోట్లకుపైగా ఓటర్లున్నారని, ఓటు హక్కు లేని వారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకూ సుమారు 60 లక్షల మంది ఉన్నారని వివరించారు. వీళ్లేకాక స్కూల్ కు పోని వాళ్లు, ఐదేండ్లలోపు పిల్లలు మరో 30 లక్షల మంది వరకూ ఉంటారని వివరించారు. ఇక కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు