Feroz Khan: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి..
Feroz Khan: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద.. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Feroz Khan: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద.. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఢివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడగా. కాంగ్రెస్ నేత, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.